ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్..

ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్..

వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్  రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు ముందస్తు  బెయిల్ మంజూరు చేస్తూ వెకేషన్ బెంచ్ తీర్పునిచ్చింది. అవినాష్ దాఖలు చేసిన పిటిషన్ పై పలు దఫాలుగా సుధీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం..షరతులతో కూడి బెయిల్ ఇచ్చింది. ప్రతి శనివారం  సీబీఐ విచారణకు హాజరుకావాలని చెప్పింది. అనుమతి లేకుండా దేశం విడిచి పెట్టి వెళ్లరాదని సూచించింది.  వివేక హత్య కేసులో విచారణ నుంచి  అవినాష్ రెడ్డికి ఊరట లభించినట్టైంది.

మే 22న అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా హాజరుకాలేదు. తన తల్లికి హెల్త్ బాగ లేదని విచారణకు  రాలేనని సీబీఐని గడువు అడిగిన సంగతి తెలిసిందే.. కర్నూలులోని విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి తల్లికి  చికిత్స అందించారు.  ఆ సమయంలో అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారు.

అవినాష్ రెడ్డికి కోర్టు షరతులు

  • రూ. 5లక్షల పూచీకత్తుతో రెండు షూరిటీలు
  • జూన్ 19 వరకు ప్రతి  శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలి
  • ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల మధ్య విచారణకు హాజరు కావాలి
  • సీబీఐ పర్మిషన్ లేకుండా దేశం విడిచి వెళ్లొద్దు
  • బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సీబీఐకి సూచన