![యాంటీవైరస్ టిఫిన్ సెంటర్.. ఇక్కడ అన్ని టిఫిన్లు దొరుకును](https://static.v6velugu.com/uploads/2020/11/tfn.jpg)
న్యూఢిల్లీ: యాంటీవైరస్ పేరుతో ఓ టిఫిన్ సెంటర్ ఉందంటే నమ్ముతారా? కరోనా కాలమండీ బాబూ.. నమ్మాల్సిందే మరి. ఒడిశాలో ఈ పేరుతో ఒక టిఫిన్ సెంటర్ ఉంది. సదరు టిఫిన్ సెంటర్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పోస్ట్ చేయడంతో దీని గురించి వైరల్ అవుతోంది. బెర్హంపూర్‌లోని గాంధీనగర్ మెయిన్ రోడ్‌లో ఉన్న ఈ టిఫిన్ సెంటర్ పేరు వినూత్నంగా ఉండటంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీ, దోశ, సమోస, ఉప్మా, వడ, పన్నీర్ టిక్కా, పరోటా, బట్టర్ దోశ, పూరితోపాటు పకోడి లాంటి మరికొన్ని డిషెస్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. పేరు డిఫరెంట్‌గా ఉండటంతో చాలా మంది ఇక్కడ టిఫిన్ చేసి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కరోనా టైమ్‌లో ట్రెండింగ్‌కు తగ్గట్లుగా యజమాని హోటల్‌కు మంచి పేరు పెట్టారంటూ నెటిజన్స్ ఈ ఫొటోలను చూసి కామెంట్లు పెడుతున్నారు. మీల్స్‌లో శానిటైజర్‌ను కలపకపోతే బాగుంటుంది అంటూ మరికొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ టిఫిన్ సెంటర్‌పై కొందరు మీమ్స్ కూడా చేశారు. ఇప్పుడవి నెట్‌లో ట్రెండ్ అవుతున్నాయి.