
శివ కందుకూరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘బూమరాంగ్’. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన ఆండ్రూ బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లండన్ గణేష్, డా ప్రవీణ్ రెడ్డి వూట్ల నిర్మిస్తున్నారు. మంగళవారం శివ కందుకూరి బర్త్‌డే సందర్భంగా తన క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ కొత్త పోస్టర్‌తో విషెస్ తెలియజేశారు మేకర్స్.
ప్రశాంత్ వర్మగా శివను పరియం చేశారు. బ్లాక్ సూట్‌లో ఓ కుక్కను పట్టుకుని చుట్టూ శవాల మధ్య వైల్డ్ లుక్‌లో ఇంప్రెస్ చేశాడు శివ. ఈ పోస్టర్‌కు ‘కర్మకు మెనూ లేదు, అయినప్పటికీ మీకు ఏం కావాలో వడ్డిస్తుంది’ అనే క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.