పెయిడ్ న్యూస్​ను రికార్డ్ చేయండి: అనుదీప్

పెయిడ్ న్యూస్​ను రికార్డ్ చేయండి:  అనుదీప్

హైదరాబాద్, వెలుగు :  న్యూస్ పేపర్లు, కేబుల్ చానెళ్లలో వచ్చే పెయిడ్ న్యూస్​ను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా రికార్డ్ చేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల ఉప అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. 

విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. వార్తలను జాగ్రత్తగా పరిశీలించాలని, అవి పెయిడ్ న్యూస్ అని తెలిసిన వెంటనే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలన్నారు. ఎన్నికల సమాచారం కోసం ఏర్పాటు చేసిన 1950 కాల్ సెంటర్​ను కలెక్టర్ పరిశీలించారు. సందేహాల కోసం కాల్ సెంటర్​కు ఫోన్ చేసిన వారికి వెంటనే జవాబు చెప్పాలని అక్కడి  సిబ్బందికి సూచనలు చేశారు.