హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ముందు రాష్ట్ర సర్కారు భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. కొంతకాలంగా వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్‌లకూ పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 31మంది ఐఏఎస్ అధికారులకు ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ఎంసీహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్‌గా శశాంక్ గోయల్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన సెంట్రల్ సర్వీస్ నుంచి ఇటీవలే రాష్ట్ర సర్కార్‌కు అటాచ్ అయ్యారు.
యూత్ సర్వీసెస్, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్‌ను నియమించింది. అలాగే, ఆర్కియాలజీ డైరెక్టర్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. గురుకుల విద్యాసంస్థల సొసైటీ సెక్రటరీగా నవీన్ నికోలస్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియా ఆల, ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టిని బదిలీ చేసింది. ఆయుష్ డైరెక్టర్‌గా హరిచందన, హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీగా అలుగు వర్షిణి, స్పోర్ట్స్ డైరెక్టర్‌గా కొర్రా లక్ష్మి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌గా హైమావతిని నియమించింది. ఆర్థికశాఖ జాయింట్ సెక్రటరీగా కె.హరిత, టూరిజం డైరెక్టర్‌గా కె.నిఖిల, వ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రటరీగా సత్య శారదాదేవి, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యను నియమించింది.
పెద్దపల్లి కలెక్టర్‌గా ముజమిల్ ఖాన్, టీఎస్ ఫుడ్స్ ఎండీగా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్, అలాగే సెర్ప్ సీఈవోగా పి.గౌతం, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ఎస్.స్నేహ, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా మంద మకరందును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్‌గా కుమార్ దీపక్, పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా చెక్క ప్రియాంక, కరీంనగర్ అదనపు కలెక్టర్‌గా జల్దా అరుణశ్రీ, సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్, రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్వాల్, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌గా అభిలాష అభినవ్, కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా మను చౌదరి, జగిత్యాల అదనపు కలెక్టర్‌గా టీఎస్ దివాకర్, మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్‌గా వెంకటేశ్ ధోత్రే నియమితులయ్యారు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న కే స్వర్ణలతను జీఏడీకి ప్రభుత్వం బదిలీ చేసింది.
అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలుగా డిప్యూటీ కలెక్టర్లు
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. కొందరిని అడిషనల్ కలెక్టర్లుగా, మరికొందరిని ఆర్డీవోలుగా నియమించింది. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ కలెక్టర్లు (రెవెన్యూ)గా సంగారెడ్డికి ఆర్డి. మధూరి, పెద్దపల్లికి జీవీ శ్యాం ప్రసాద్ లాల్, మేడ్చల్ మల్కాజ్‌గిరికి విజేందర్ రెడ్డి, నిజామాబాద్‌కు యాదిరెడ్డి, హనుమకొండకు మహేందర్ జీ, రంగారెడ్డికి వి.భూపాల్ రెడ్డి, కరీంనగర్‌కు కె. లక్ష్మీనారాయణ, సూర్యాపేటకు ఎ. వెంకట్‌రెడ్డి, నల్గొండకు జె. శ్రీనివాస్‌ను నియమించారు.
మంచిర్యాల ఎస్డీసీ ఎల్ఏ అండ్ ఆర్ అండ్ ఆర్గా సిదం దత్తు, కోరుట్ల ఆర్డీవోగా ఎస్. రాజేశ్వర్, కీసర ఆర్డీవోగా రాజేశ్‌కుమార్, తాండూర్ ఆర్డీవోగా ఎం.శ్రీనివాస్‌రావు, అచ్చంపేట ఆర్డీవోగా గోపిరాం, ఎస్టేట్ ఆఫీసర్ జీఏడీకు కె. చంద్రకళకు పోస్టింగ్ ఇచ్చారు. ఇంకో 24 మందికి వివిధ ప్రాంతాల్లో ఆర్డీవోలుగా ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్‌లు ఇవ్వడంతో పాటు మరో 13 మందికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.