స్టూవర్ట్‌పురం గజదొంగ నాగేశ్వరరావుగా రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. తాజాగా మరో హీరోయిన్‌ని పరిచయం చేశారు మేకర్స్. తమిళ హీరోయిన్ అనుకృతి వాస్ ఇందులో కీలక పాత్ర పోషిస్తోందని చెబుతూ, ఆమె ఫస్ట్ లుక్‌తో పాటు తన క్యారెక్టర్‌ను పరిచయం చేశారు.
ఇందులో ఆమె జయవాణిగా కనిపించనుందని రివీల్ చేశారు. చీరకట్టులో కనిపిస్తున్న అనుకృతి పోస్టర్ ఆకట్టుకుంటోంది. 2018 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలిచిన అనుకృతి.. తమిళంలో విజయ్ సేతుపతి ‘డీఎస్పీ’లో నటించింది. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో టాలీవుడ్ ఆడియెన్స్‌ను పలకరించనుంది.