బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రస్తుతం సౌత్ సినిమాల్లోనూ నటిస్తూ ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. గతేడాది ‘కార్తికేయ 2’లో సైంటిస్ట్‌గా కీలక పాత్రలో మెప్పించిన ఆయన.. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి అనుపమ్ ఖేర్ ఫస్ట్ లుక్‌తో పాటు ఆయన క్యారెక్టర్‌ను పరిచయం చేశారు.
ఇందులో ఐబి ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా అనుపమ్ కనిపించనున్నట్టు రివీల్ చేశారు. సూట్ వేసుకుని, కళ్లద్దాలతో.. చేతిలో వాకీ టాకీతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న అనుపమ్ పోస్టర్ ఆకట్టుకుంది. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 17న ‘టైగర్ దండయాత్ర’ పేరుతో టీజర్ రిలీజ్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ రాస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.