
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల రూపొందిస్తున్న చిత్రం ‘పరదా’. మంగళవారం అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని తన పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
ఇందులో ఆమె ‘సుబ్బు’ పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చెట్టుకు చీరతో ఊయల కట్టుకుని ఊగుతూ కనిపిస్తోంది అనుపమ. తన చున్నీతో కళ్లు మూసుకుని మైక్‌తో ‘పరదాలమ్మ పరదాలు.. రంగు రంగుల పరదాలు.. డిజైనర్ పరదాలు.. తీసుకోవాలమ్మ తీసుకోవాలి’ అంటూ చెప్పడం తన పాత్రపై ఆసక్తిని పెంచింది.
దర్శన రాజేంద్రన్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.