అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran).. ఫ్యామిలీ బ్యూటీ..హోంలీ అందం..రింగురింగుల జుట్టు.. కట్టుబొట్టులో అనుపమ అంటే అనుపమే అంటారు సినీ ఫ్యాన్స్.. ఇది ఇప్పటి వరకు టాక్..టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూస్తే మొత్తం ఫీలింగ్ మారిపోయింది.. కుర్రోళ్లకు గిలిగింతలు పెట్టింది.. బోల్డ్ బ్యూటీగా ఇరగదీసింది.. మామూలు ముద్దు అంటేనే అల్లంత దూరంగా ఉంటే అనుపమ..టిల్లు స్క్వేర్లో మాత్రం లిప్ లాక్ కిస్సులతో గిలిగింతలు పెట్టేసింది.. టిల్లుగాడి అల్లరి ఏమోగానీ.. అనుపమ అందం.. బోల్డ్ సీన్స్ మాత్రం కిర్రాక్ అంటున్నారు ఫ్యాన్స్..
అనుపమ పరమేశ్వరన్.. పెద్దగా సినిమాలు అయితే ఏమీ లేవు.. టిల్లుపైనే హోప్స్ పెట్టుకున్నట్లు ఉంది.. అందుకే తన సినీ జర్నీని కొత్తగా మొదలుపెట్టినట్లు ఉంది. ఫ్యామిలీ మూవీస్ మాత్రమే కాదు.. బోల్డ్ సీన్స్ కు ఓకే అనే సంకేతాలను నిర్మాతలకు పంపించింది. లిప్ లాక్ సీన్స్ కామన్.. అనుపమ హాట్ రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి అంటూ టిల్లు స్క్వేర్ నుంచి సంకేతాలు పంపించింది.
I am excited ???
— AKLESH (@aklesh__sahni) February 14, 2024
Are you excited drop your comment YAS-No#AnupamaParameswaran#TilluSquare pic.twitter.com/1zOGd8xsy7
అనుపమ పరమేశ్వరన్ అంటే మామూలు అమ్మాయి అనుకున్నారా.. లంగా ఓణీ క్యారెక్టర్లే కాదు.. మోడ్రన్.. హాలివుడ్ రేంజ్ రొమాన్స్ ఈజీగా చేసేస్తుంది అన్నట్లు టిల్లు స్క్వేర్లో తనలోని హాట్ యాక్టింగ్ బయటపెట్టేసింది. లిప్ కిస్సులతో చెలరేగిపోయింది అనే చెప్పాలి.. అనుపమను అస్సలు ఊహించలేదు ఫ్యాన్స్ ఇప్పటి వరకు.. టిల్లు స్క్వేర్లో మాత్రం ఈ బ్యూటీ తన క్యారెక్టర్ ద్వారా బోలెడు సినిమా ఛాన్సులు అయితే కొట్టేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.. అనుపమ నువ్వూ మారిపోయావా..