‘కార్తికేయ 2’ చిత్రం పాన్ ఇండియా సక్సెస్ తర్వాత.. ‘18’ పేజెస్’తో మరో విజయాన్ని అందుకున్న అనుపమ పరమేశ్వరన్.. త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించబోతోంది. తమిళంలో వరుస భారీ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇదొక లేడీ ఓరియంటెడ్ మూవీ అని, సోమవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో నాలుగు దక్షిణాది భాషల్లో దీన్ని నిర్మించబోతున్నారట.
దర్శకుడితో పాటు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ‘బటర్ ఫ్లై’ అనే ఫిమేల్ ఓరియంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనుపమ.. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డకు జంటగా ‘టిల్లు స్క్వైర్’లో నటిస్తోంది. మరోవైపు తమిళంలో జయం రవికి జంటగా ‘సైరన్’, మలయాళంలో సురేష్ గోపీ హీరోగా రూపొందుతున్న ‘జె.ఎస్.కె’ అనే చిత్రంలో నటిస్తోంది.