Janaki v/s State of Kerala: గ్లామర్ బ్యూటీ నుండి జానకిగా.. అనుపమా న్యాయ పోరాటం!

మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే టిల్లు స్క్వైర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె తన గ్లామర్ తో కుర్రకారుని కట్టిపడేసింది. హీరో సిద్దుతో రొమాన్స్ హద్దులు దాటించి స్క్రీన్ పై రచ్చ రచ్చ చేసింది. మొన్నటివరకు హోమ్లీ పాత్రలు చేసిన ఆమెను ఒక్కసారిగా గ్లామర్ పాత్రలో చూసి ఆడియన్స్ అవాక్కయ్యారు. అనుపమా దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేశారు. 

ఇదిలా ఉంటే.. ఆమె నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. మలయాళంలో ఆమె నటించిన లేటెస్ట్ మూవీ జాన‌కి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ. దర్శకుడు ప్ర‌వీణ్ నారాయ‌ణ‌న్ తెరకెక్కిస్తున్న ఈ కోర్టు రూమ్ డ్రామాలో సురేష్ గోపి మరో కీ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో అనుపమ న్యాయం కోసం పోరాడే యువతిలా తన నటనతో ఆడియన్స్ ను అలరించనున్నారు. తన తరుపున వాదించే న్యాయవాది పాత్రలో సురేష్ గోపి కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్వయంగా అనుపమా ప్రకటించారు. 

ALSO READ :- IPL 2024: గిల్ సేనకు భారీ ఎదురు దెబ్బ.. గుజరాత్ మ్యాచ్ విన్నర్‌కు గాయం

జాన‌కి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ సినిమా కోసం ఇటీవలే నా డబ్బింగ్ పూర్తి చేశాను. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు రానుంది.. అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు అనుపమా. ప్రస్తుతం అనుపమా చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇటీవలే టిల్లు స్క్వైర్ సినిమాలో గ్లామర్ తో రచ్చ చేసిన అనుపమా.. జాన‌కి వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ కేర‌ళ సినిమాలో నటనకు స్కోప్ ఉన్న పాత్రలో ఎలా అలరిస్తారో చూడాలి.