
టిల్లు స్క్వైర్(Tillu Squire) సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). ఈ సినిమా తన గ్లామర్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. హాట్ హాట్ సీన్స్ తో. లిప్ లాక్స్ తో ఆడియన్స్ కు చెమటలు పట్టించింది అనుపమ. దాంతో ఆమెలోని గ్లామర్ కోణాన్ని వాడుకునేందుకు ఫిక్స్ అవుతున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే వరుసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టింది అనుపమ.
ఇదిలా ఉంటే.. తాజాగా అనుపమ పరమేశ్వరన్ చేసిన ఇన్స్టా పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. అదేంటంటే.. చాలా కాలంగా అనుపమ నడుమునొప్పితో బాధపడ్తున్నారట. ఆ నొప్పి తగ్గడానికి ఇలాంటి మసాజ్ కావాలంటూ ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఒక వ్యక్తి పడుకొని ఉంటే తనపైకి రోడ్ రోలర్ ఎక్కినట్టుగా ఉంది. ఆ ఫోటోను షేర్ చేసి అలాంటి మాసాజ్ కావాలంటూ పోస్ట్ చేసింది. దాంతో ఆమె చేసిన ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో నెటిజన్స్ ఆ ఫోటోపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
ఇక టిల్లు స్క్వైర్ తరువాత అనుపమ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుత ఆమె పరదా అనే సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాను సినిమా బండి మూవీ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.