తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనదైన యాక్టింగ్తో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఉంగరాల జుట్టుతో మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ మళ్లీ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తోంది. తన వయ్యారాలను ఒలకబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చేస్తోంది. వాటిని చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
"కార్తికేయ 2" విజయం అనుపమ మళ్లీ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పసుపు రంగు దుస్తుల్లో, మృదువైన చిరునవ్వుతో తన ఉంగరాల జుట్టును విరబోసుకొని అందాలను ప్రదర్శిస్తూ తీయించుకున్న ఫొటోలను షేర్ చేసింది. ఈఫొటోలను చూసిన ఫ్యాన్స్ కామెంట్లలో కాంప్లిమెంట్ల వర్షం కురిపించేస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్ తెలుగులో చివరగా నటించిన మూవీ బట్టర్ ఫ్లై. త్వరలో డీజే సిద్దుతో టిల్లూ స్క్వేర్ లో నటిస్తుంది. ఈ మూవీలో తన క్యారెక్టర్ కు అందరు ఫిదా అవ్వాల్సిందే అంటూ ఆసక్తి రేపింది. ఈ సినిమాలే కాకుండా మలయాళం, తమిళ్ అనుపమ మూవీస్ చేయనుంది. ప్రస్తుతం అనుపమ నుంచి 9 సినిమాలు రాబోతున్నట్లు సమాచారం.