మరోసారి శర్వాతో అనుపమ పరమేశ్వరన్

మరోసారి శర్వాతో అనుపమ పరమేశ్వరన్

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన ‘శతమానం భవతి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ వీళ్లద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమా రాబోతోంది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కేకే రాధామోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.  

ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ శనివారం హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనుపమ  పరమేశ్వరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరును అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.  శర్వా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 38వ చిత్రం.  1960 బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఈ హై వోల్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్షన్ డ్రామాలో అనుపమ పాత్ర కీలకంగా ఉండబోతోందని మేకర్స్ తెలియజేశారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.