Paradha: పరదాలో అనుపమ.. మా అందాల సిరి సాంగ్ అప్డేట్

Paradha: పరదాలో అనుపమ.. మా అందాల సిరి సాంగ్ అప్డేట్

అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పరదా’(Paradha) .సినిమా బండి చిత్రంతో మెప్పించిన దర్శకుడు  ప్రవీణ్ కండ్రేగుల దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌కు పాజిటివ్‌‌‌‌ రెస్పాన్స్ రాగా, తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌‌‌‌ స్టార్ట్ చేశారు.

ఈనెల 23న మొదటి పాటను విడుదల చేయబోతున్నట్టు శుక్రవారం (మార్చి 21న)  ప్రకటించారు. ‘మా అందాల సిరి’ అంటూ సాగే ఈ  పాటను గోపీ సుందర్ కంపోజ్ చేశాడు. అనుపమ పరమేశ్వరన్‌‌‌‌పై చిత్రీకరిం చినట్టు పోస్టర్‌‌‌‌‌‌‌‌ను బట్టి అర్థమవుతోంది.

ఇందులో ఆమె పరదాలు అమ్మే ‘సుబ్బు’ అనే అమ్మాయిగా నటిస్తోంది. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ,  విజయ్ డొంకడ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న 'పరదా' సినిమాలో అనుపమను ఎలా కనిపిస్తుందో అంటూ ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.