నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)కు పెళ్లి అయిపోయిందా? ఏంటి..? తాళిబొట్టు చూపిస్తూ ఫొటోలనూ షేర్ చేసింది మరి. ఇంతకూ వరుడెవరో..? అంటూ ఫ్యాన్స్ కన్ ఫ్యూజన్ లో పడిపోయారు. తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది అనుపమ.
ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు పెద్ద సినిమాలున్నాయి. ఈగల్, టిల్లు స్క్వేర్..ఈ రెండు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇవే కాకుండా తమిళ్ లో జయం రవి సరసన సైరెన్ సినిమాలో నటిస్తుంది. సినిమాలే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫొటోస్ తో పాటు..తన సినిమాలోని క్యారెక్టర్స్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఫన్నీ క్యాప్షన్స్ ఇస్తూ ఉంటుంది.
ఇప్పుడు లేటెస్ట్గా పెళ్లికూతురుగా మారిపోయింది. పట్టుచీర, ఒంటినిండా నగలు..మెడలో తాళిని చూపిస్తూ ఫొటోకు పోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ అనుపమ పరమేశ్వరన్ కు పెళ్లి అయిపోయిందా..? అంటూ ఫీల్ అయిపోతున్నారు. కానీ, అది నిజం పెళ్లి కాదు. ఆమె నటించిన సైరెన్ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ స్టిల్!