నువ్వు ఏమైనా పెద్ద హీరోయిన్‌వా.. కాదంటూనే కౌంటర్ ఇచ్చిందిగా

నువ్వు ఏమైనా పెద్ద హీరోయిన్‌వా.. కాదంటూనే కౌంటర్ ఇచ్చిందిగా

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ఇచ్చిన కౌంటర్ కు ఓ నెటిజన్ దిమ్మతిరిగిపోయింది. కాస్త అత్యుత్సాహం ప్రదర్శించిన సదరు నెటిజన్స్ కు చెంప ఛెళ్లుమనిపించేలా సమాధానాం ఇచ్చింది. ప్రస్తుతం అనుపమ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. ఇందులో భాగంగా ఒక నెటిజన్ అనుపమ సినిమా అవకాశాలను ఉద్దేశిస్తూ.. "నువ్వు పెద్ద హీరోయిన్‌వి కాదు.. అందుకే నీకు పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు రావడం లేదు.. అసలు నువ్వు హీరోయిన్‌ మెటీరియలే కాదు' అంటూ ఓపెన్ కామెంట్స్ చేశాడు. దానికి ఏమాత్రం తడగబడకుండా సమాధానం ఇచ్చిన అనుపమ.. "మీరు చెప్పింది కరెక్టే అన్నా.. నేను హీరోయిన్ టైప్ కాదు, యాక్టర్ టైప్‌' అని చెంపమీద కొట్టినట్లు బదులిచ్చింది. 

ఇది చూసిన నెటిజన్లు అనుపమకు సపోర్ట్ గా కామెంట్స్‌ చేస్తున్నారు. అనుపమ బ్యూటీ విత్ టాలెంట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనుపమ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా వస్తున్న  టిల్లూ స్క్వేర్‌(Tillu Square  సినిమాతో పాటు.. రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న ఈగల్(Eagle) మూవీలో చేస్తుంది.