ఏపీ పీఎస్సీ ఛైర్ పర్సన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అనురాధ గతంలో ఇంటిలిజెన్స్ చీఫ్, హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు.
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేయడంతో దాదాపు మూడు నెలలుగా ఖాళీగా ఉన్న పోస్టులో అనురాధను నియమించింది ప్రభుత్వం.
మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, సంతోష్ మెహ్రాల పేర్లు కూడా వినిపించాయి. కానీ ప్రభుత్వం చివరకు అనురాధ వైపు మొగ్గు చూపింది. 1987 బ్యాచ్ కు చెందిన అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్ర బాబు కూడా ఐపీఎస్ అధికారి.
ALSO READ | మహిళలకు శుభవార్త.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు