వేములవాడ, వెలుగు: వేములవాడశ్రీ రాజరాజేశ్వరస్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఆలయ చెరువులో కొనసాగుతున్న నిర్మాణ పనులను అడిషనల్కలెక్టర్ పి. గౌతమితో కలిసి పరిశీలించారు. నటరాజ విగ్రహం ఏర్పాటులో ఆలయ అర్చకుల సూచనలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, టూరిజం డీఈ విద్యాసాగర్, జేఈ జీవన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ మహేశ్‌కుమార్, ఈఈ రాజేశ్ పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
సర్కార్ దవాఖానల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అందుకు డాక్టర్లు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్సూచించారు. వేములవాడ ఏరియా హాస్పిటల్‌ను ఆయన సందర్శించారు. గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావు, సూపరింటెండెంట్ మహేశ్ రావు
పాల్గొన్నారు.