
సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు ఫూలే,సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్ర సినిమా 'ఫూలే'..ఏప్రిల్ 11న విడుదల కానుండగా..సెంట్రల్ ఫిల్మ్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో ఏప్రిల్ 25కు వాయిదా పడింది. దీనిపై ఫిల్మ్ మేకర్, నిర్మాత అనురాగ్ కశ్యప్ తీవ్రంగా విమర్శించారు. ‘ఫూలే ’విడుదలను అడ్డుకున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ,బ్రాహ్మణ సమాజంలోని ఒక వర్గంపై అనురాగ్ కశ్యప్ మండిపడ్డారు. విడుదల కాని చిత్రంలోని సన్నివేశాలు వారికి ఎలా అందుబాటులోకి వచ్చిందని కశ్యప్ ప్రశ్నించారు.
అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ,పత్రలేఖ నటించారు. జీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రణయ్ చోక్షి, జగదీష్ పటేల్, రితేష్ కుదేచా, అనుయా చౌహాన్ కుదేచా, సునీల్ జైన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం మొదట ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉండగా.. CBFC అభ్యంతరం చెప్పడంతో ఏప్రిల్ 25కి వాయిదా పడింది.
ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన తర్వాత ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఈ సినిమా బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపిస్తుందని కులవాదాన్ని ప్రోత్సహిస్తుందని మహారాష్ట్రలోని బ్రాహ్మణ ఫెడరేషన్ తో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు ఆరోపించాయి. ఇదే కాకుండా సెన్సార్ బోర్డు కూడా కుల సంబంధిత పదాలను తొలగించాలని సూచించింది.
దేశంలోని మనుషులంతా సమానత్వంతో జీవించాలని వర్ణ, లింగ వివక్షకు వ్యతిరేకంగా దళిత, గిరిజన, బహుజన వర్గాల అభ్యున్నతి, మహిళల హక్కుల కోసం జ్యోతిబా ఫూలే చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. CBFC అడ్డుకోవడంతో వాయిదా పడింది.
అయితే బ్రాహ్మణులపై అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలు వివాదం రేపాయి. కులతత్వం గురించి తాను చేసిన వ్యాఖ్యల తర్వాత తన కుమార్తె, కుటుంబ సభ్యులు,సహచరులపై అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. బ్రాహ్మణ సమాజంపై చేసిన వ్యాఖ్యకు సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు.
'ఫూలే' సినిమాపై వివాదం చెలరేగిన క్రమంలో బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ రాజకీయంగా విమర్శలు వచ్చాయి. అనురాత్ కశ్యప్ వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చౌర్వేది ఖండించారు. బ్రాహ్మణులు చేసిన చారిత్రక తప్పిదాల భారం గురించి తనకు తెలుసునని అయితే మొత్తం సమాజానికి వ్యతిరేకంగా అవమానకరమైన, అసహ్యకరమైన పదాలను ఉపయోగించరాదని చౌర్వేది అన్నారు.