ప్రతిపక్షాల్లో మానవత్వం చచ్చిపోయిందా?: అనురాగ్ ఠాకూర్

 చండీగఢ్‌‌: పొరుగు దేశాల్లో అణచివేతకు, దౌర్జన్యాలకు గురవుతున్న హిందూ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన దేశానికి ఉందని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్ పేర్కొన్నారు. మతపరం గా మైనారిటీలు కావడం వల్లే వారిపై ఆకృత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. వాటిని భరించలేక మన దేశానికి వలస వచ్చిన వారిని అక్కున చేర్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వం సీఏఏను తీసుకొచ్చిందన్నారు.

 అయితే, మన దేశంలోని ప్రతిపక్షాలలో మానవత్వం చనిపోయినట్టుందని, అందుకే ఈ చట్టాన్ని అడ్డుకుంటున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. పొరుగు దేశాల్లో హిందూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, బలవంతంగా వారిని పెళ్లి చేసుకుని మతం మార్చేస్తున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వమే లేకుంటే అఫ్గానిస్తాన్​ లో సిక్కులను ఎవరు కాపాడే వారని అనురాగ్​ ఠాకూర్ ప్రశ్నించారు.