
లక్నో: ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఓటమి ఆ పార్టీ ముఖ్య నేత ఆతిశీకి సంతోషం కలిగించిందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఆతిశిని ఓడించడానికి కేజ్రీవాల్ కుట్రలు పన్నారని అవన్నీ విఫలమై ఆమె గెలిచారని తెలిపారు. అందుకే గెలిచాక ఆనందంతో ఆమె డ్యాన్స్ చేశారన్నారు. ‘‘ఫ్రీడమ్ ఫైటర్ అన్నా హజరే భుజాలపైకెక్కి కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు.
ఆ తర్వాత పార్టీ పెట్టారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులను పంపేశారు. ఆప్ మంత్రులు, సీనియర్ నేతలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ టీమ్ పని చేసింది. చివరికి కేజ్రీవాలే ఓడారు. ఎన్నికల ప్రచారంలో పోస్టర్స్, బ్యానర్లను పరిశీలించండి. ఆతిశీ పేరు ఎక్కడా లేదు. కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమెను ఓడించడానికి ప్రయత్నాలు జరిగాయి. అందుకే లీక్ అయిన వీడియోలో ఆమె డ్యాన్స్ చేయడాన్ని చూశాం” అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.