2008 ముంబై టెర్రరిస్ట్ ఎటాక్ తర్వాత భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇక 2012 తర్వాత ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం మానేశాయి. అప్పటినుంచి రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దిగజారుతూ వస్తున్నాయి. ఐసీసీ టోర్నీ వస్తే గానీ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూడాల్సిన పరిస్థితి. ఎంతో క్రేజ్ ఉండే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ని అభిమానులు పదే పదే చూడాలని ఆరాటపడుతున్నారు. అయితే ఈ రెండు జట్ల మధ్య భవిష్యత్తులో సిరీస్ లు జరిగే అవకాశం లేదని తేల్చేసాడు అనురాగ్ ఠాకూర్.
ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని ఉదయపూర్ విలేకరులతో మాట్లాడిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఠాకూర్ మాట్లాడుతూ " సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే పాకిస్థాన్ తో భారత్ ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులు ఆడదు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించకూడదు. ఈమేరకు బీసీసీఐ ముందే నిర్ణయం తీసుకుంది" అని చెప్పాడు.
Also Read :- ధోనీ నిస్వార్ధపరుడు.. ఆ త్యాగం చేసుండకపోతే ఎన్నో రికార్డులు తనవయ్యేవి: గంభీర్
"ఉగ్రవాదాన్ని అరికట్టే వరకు పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఆడబోమని బీసీసీఐ చాలా కాలం క్రితమే నిర్ణయించుకుంది. సరిహద్దుల గుండా దాడులు లేదా చొరబాట్లను ఆపితే తప్ప పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించబోమని తెలియజేసారు. ఇటీవలే జమ్మూకాశ్మీర్‌లో పాకిస్తాన్‌కు చెందిన కొందరు టెర్రరిస్టులు దాడి చేయగా.. ముగ్గురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారు.ఈ వార్త విన్న చాలా మంది అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటమే మానేయాలని, ద్వైపాక్షిక సిరీసులే కాకుండా ఆసియా కప్ వంటి మల్టీ నేషనల్ టోర్నీల్లో కూడా పాక్‌తో ఆడకూడదని డిమాండ్ చేశారు.