ఆ బోల్డ్ సిరీస్ ఆఫర్స్ తెచ్చిపెడుతోందట

లస్ట్ స్టోరీస్2(Lust stories2) సిరీస్ లో తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీ అనుష్క కౌశిక్(Anushka kaushik). బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సిరీస్ లో తన గ్లామర్ తో కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది ఈ భామ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క కౌశిక్.. లస్ట్ స్టోరీస్2 సిరీస్ గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి చాల విషయాలు చెప్పుకొచ్చింది. 

ఇక లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ గురించి మాట్లాడిన అనుష్క కౌశిక్.. ముందు ఈ సిరీస్ లో నటించేందుకు ఒప్పుకోలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముందు ఈ ప్రాజెక్టు చేయడానికి నేను ఒప్పుకోలేదు. ఓకే చెప్పిన తర్వాత కూడా చాలా ఆలోచించాను. రెండు. మూడు సార్లు కథ చదవి ఈ పాత్ర నేను చేయగలనా? అందులోనూ ఆ క్లైమాక్స్. ఒకదశలో నేను చేయలేనని కూడా చెప్పేశా. కానీ.. చాలా డిస్కషన్స్ తర్వాత ఒప్పేసుకున్నాను. ప్రస్తుత ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది ఈ సిరీస్ లో చూపించబోతున్నాం అని మేకర్స్ నాకు వివరించారు. మేము అనుకున్నట్లుగానే ప్రజలు కూడా మా ప్రయత్నాన్ని అభినందించారని చెప్పుకొచ్చారు  అనుష్క కౌశిక్. 

ఈ సిరీస్ చేయడం, ఆ సిరీస్ లో తన నటన వల్ల తనకు వరుస ఆఫర్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చింది ఈ భామ. ఇక లస్ట్ స్టోరీస్ సక్సెస్ తో ప్రస్తుతం చేతినిండా ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. త్వరలోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబందించిన ఫుల్ డీటెయిల్స్ తవరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.