
విరాట్ కోహ్లీ , అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రెండో బిడ్డకు అకాయ్ అని నామకరణం చేశామని చెప్పుకొచ్చాడు.
ఈ సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని కోరాడు. ఈ వార్త తెలియగానే వీరిద్దరికీ సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కోహ్లీ, అనుష్క 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు 2021 జనవరి 11న తొలి సంతానంగా వామిక జన్మించింది.
— Virat Kohli (@imVkohli) February 20, 2024