మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క దంపతులు

విరాట్‌ కోహ్లీ(Virat kohli) అనుష్క(Anushka) జంట మరోసారి తల్లిందండ్రులు కాబోతున్నారా? ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్​ మీడియాలో ట్రెండ్​ అవుతోంది. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో వామిక(Vamika)కు జన్మనిచ్చారు. కానీ ఈ చిన్నారి ఫొటోను మీడియాకు ఎక్కడ చూపించలేదు. కానీ.. వామికతో ఫోటోలను మాత్రం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అందులో కూడా పాప మొహం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఇక ఇప్పుడు మరోసారి విరాట్​, అనుష్క జంట తమ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​ చెప్పనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే తమ రెండో సంతనానికి సంబంధించిన వార్తను ఫ్యాన్స్ తో షేర్‌ చేసుకోనున్నారని సమాచారం. అనుష్క కూడా కొంత కాలంగా మీడియాలో ఎక్కువగా కనించడంలేదు. ఇటీవల విరాట్ ఆడిన మ్యాచ్ లకు కూడా ఆమె హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్నారని, త్వరలోనే ఆ విషయాన్నీ మీడియా అండ్ ఫ్యాన్స్ తో పంచుకోనున్నారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు.. రీసెంట్ గా ఈ జంట ముంబైలోని ఒక మెటర్నిటీ హాస్పటల్ లో కనిపించారట. అయితే ఆ ఫోటోలను మీడియాలో లీక్ చేయొద్దని, తామే త్వరలో ఈ గుడ్ న్యూస్ ను షేర్ చేస్తామని చెప్పారట.

ఇవన్నీ చూస్తుంటే విరుష్క జంట మళ్ళీ తల్లిందండ్రులు కాబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికైతే ఈ వార్తలు రూమర్స్ గానే ఉన్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే విరుష్క జంట అదికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే. ఇక నవంబర్‌ 5న విరాట్‌ పుట్టినరోజున సందర్భంగా తమ అభిమానులకు ఈ శుభవార్తను చెప్పనున్నారు అని తెలుస్తోంది.