బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మరియు ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తమ వైవాహిక జీవితాన్ని చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. దీంతో వీరిద్దరి పెళ్లి తర్వాత లండన్ లో సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో తమ పిల్లలని కూడా మీడియా కి చాలా దూరంగా ఉంచుతున్నారు.
నేడు (నవంబర్ 5) విరాట్ కోహ్లీ పుట్టిన రోజు కావడంతో తమ ఇద్దరి పిల్లలతో కలసి దిగిన ఫోటోని నటి అనుష్క శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో అకాయ్, వామికని ఎత్తుకుని కనిపించాడు. కానీ ఈ చిన్నారుల ముఖాలు కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేశారు. దీంతో అభిమానులు కోహ్లీకి బర్త్ డే విషెష్ చెబుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ డిసెంబర్ 11, 2017న ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం అనుష్క శర్మ సినిమాలకి గుడ్ బై చెప్పి కుటుంబ బాధ్యతలు చక్కబెట్టే పనిలో పడింది. ఇక విరాట్ కోహ్లీ క్రికెటర్ గా కొనసాగుతున్నాడు.