అకాయ్‌కు జన్మనిచ్చిన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మొదటిసారి సోషల్ మీడియాలో సందడి చేస్తూ కనిపించారు. మే 1న తన పుట్టిన రోజు గ్రాండ్ గా జరుపుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. అనుష్కకు ఇది 36వ పుట్టిన రోజు. తన పుట్టిన రోజును భర్త విరాట్ కోహ్లీతో జరుపుకోగా.. ఈ వేడుకకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్స్ డుప్లెసిస్,మ్యాక్స్ వెల్ హాజరయ్యారు. వీరిద్దరూ అనుష్క పుట్టిన రోజు సందర్భంగా సందడి చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
అనుష్క తన పుట్టినరోజును బెంగళూరులో ఒక ఇంటిమేట్ పార్టీని నిర్వహించిందని క్రికెటర్లు వెల్లడించారు. భర్త విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ వేదికగా.. "నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నా జీవితానికి నువ్వు వెలుగువి. పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని అనుష్కపై తన ప్రేమను చాటుకున్నాడు. అనుష్క శర్మ ఫిబ్రవరి 15వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇది వారికి రెండో సంతానం కాగా.. రెండో బిడ్డకు అకాయ్ అని నామకరణం చేశారు.
విరాట్- అనుష్క 2017లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. 2013లో ఓ అడ్వర్టైజ్‌మెంట్ షూటింగ్‌లో వీరిద్దరు మొదటి సారిగా కలిశారు. అప్పుడే ఇద్దరి అభిరుచులు, మనసులు కలిశాయి. వారి దాంపత్య బంధానికి గుర్తుగా వారి జీవితాల్లోకి వామిక అడుగుపెట్టింది. క్రికెట్, సినిమా ప్రపంచంలో విరాట్- అనుష్కలను ఆదర్శ జోడీగా పేర్కొంటారు.
Anushka Sharma's birthday celebration with Virat Kohli, Faf, Maxwell and RCB team.😍❤️ pic.twitter.com/K7VYOnhqun
— Virat Kohli Fan Club (@Trend_VKohli) May 3, 2024