- అసహనంతో హరీశ్ఏదేదో మాట్లాడ్తుండు
- పత్తి కొనుగోళ్లపై అనవసర రాద్ధాంతం
హైదరాబాద్: పత్తి కొనుగోళ్లలో ఎలాంటి సమస్య లేదని, బీఆర్ఎస్ కావాలనే రాద్ధాంతం చేస్తోందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేశాడని ఫైర్అయ్యారు. గాంధీ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ‘అధికారం దక్కించుకోవాలనే అసహనంతో హరీశ్ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు.
ALSO READ | నాంపల్లి స్పెషల్ కోర్ట్‌లో కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్
పత్తిని ఉదయం 8 గంటలకు ఎందుకు కొనుగోలు చేయలేదని అంటుండు...8 గంటలకు ఎక్కడైనా కొనుగోలు చేస్తరా? ఇప్పటికే 3,66,140 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వారం నుంచి రైతుల ఖాతాల్లో బోనస్ పడుతుంది. ఏనుముల రేవంత్ అంటే ఎగ్గొట్టే రేవంత్ అంటుండు.కానీ ఏనుముల అంటే ఎస్యూరెన్సు రేవంత్ రెడ్డి. భట్టి అంటేనే బ్రాండ్ అని హరీశ్ రావు గుర్తు పెట్టుకోవాలి’ అని సూచించారు అన్వేష్ రెడ్డి.