
రాయికల్, వెలుగు: శ్రీలంకలోని కొలంబోలో ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు జరుగనున్న ప్రపంచ కప్- లాయర్స్ క్రికెట్ పోటీలకు భారత జట్టు తరపున తెలంగాణ నుంచి ఏనుగు అన్వేష్ రెడ్డి ఎంపికయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన అన్వేష్ రెడ్డి ఎంపికవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తో పాటు కామన్వెల్త్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ గా అన్వేష్ వ్యవహరిస్తున్నారు.