రూ.2 వేల కోట్లతో అన్విత గ్రూప్​భారీ రెసిడెన్షియల్​ ప్రాజెక్ట్​

రూ.2 వేల కోట్లతో అన్విత గ్రూప్​భారీ రెసిడెన్షియల్​ ప్రాజెక్ట్​

హైదరాబాద్, వెలుగు: రియల్టీ  సంస్థ అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టును చేపట్టింది. ఇవానా పేరుతో హైదరాబాద్‌‌‌‌ సమీపంలోని కొల్లూరు వద్ద భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టును నిర్మిస్తోంది. 12.9 ఎకరాల్లో రెండు దశల్లో 1,850 ఫ్లాట్లను నిర్మించనుంది. మొదటి దశలో భాగంగా 3.5 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో 2 టవర్లలో 450 ఫ్లాట్ల నిర్మాణం పూర్తవుతుంది. 

వీటిని 2024 డిసెంబర్‌‌‌‌లో కొనుగోలుదార్లకు అప్పగిస్తారు. ఇక రెండవ దశలో 9.25 ఎకరాల్లో 36 అంతస్తుల్లో 4 టవర్లను నిర్మించనుంది. ఇందులో భాగంగా 1,400 ఫ్లాట్లను 2027లో కస్టమర్లకు అందజేస్తామని అన్విత గ్రూప్ సీఎండీ అచ్యుతరావు తెలిపారు. ప్రారంభ ఆఫర్ కింద చదరపు అడుగు రూ.6,500లకు విక్రయిస్తున్నట్టు పేర్కొంది.  ఒకటి నుంచి 34వ అంతస్తు వరకు 1,360-–2,580 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2-–3 పడక గదులను నిర్మిస్తారు. 35-–36 అంతస్తుల్లో స్కై విల్లాలు నాలుగు బెడ్రూంలతో 2,900-–5,070 చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్నాయి.