భోపాల్: చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. చిప్ ఉన్న ఏ యంత్రాన్ని అయినా హ్యాక్ చేయవచ్చని తెలిపారు. “చిప్ ఉన్న ఏ మిషన్ ను అయినా హ్యాక్ చేయవచ్చు.
నేను 2003 నుంచి ఈవీఎంల ద్వారా ఓటు వేయడాన్ని వ్యతిరేకిస్తున్నాను. మన ప్రజాస్వామ్యాన్ని ప్రొఫెషనల్ హ్యాకర్లు కంట్రోల్ చేయడాన్ని మనం అనుమతించాలా! ఇది అన్ని రాజకీయ పార్టీలకు ప్రాథమిక ప్రశ్న. ఈసీఐ, సుప్రీం కోర్టు భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.” అని దిగ్విజయ సింగ్ పేర్కొన్నారు.