న్యూఢిల్లీ : అన్యా పాలిటెక్ అండ్ ఫెర్టిలైజర్స్ రూ.45 కోట్లు సేకరించడానికి శుక్రవారం నుంచి ఐపీఓను మొదలుపెడుతోంది. ఇది ఈ నెల 30న ముగుస్తుంది. ఈ కంపెనీ జింక్సల్ఫేట్ ఫెర్టిలైజర్స్, మైక్రో న్యూటియంట్మిక్చర్స్ను సాగు అవసరాల కోసం తయారు చేస్తుంది.
కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎమర్జ్ప్లాట్ఫారంలో లిస్టవుతాయి. ప్రైస్బ్యాండ్ను రూ.13–14 మధ్య నిర్ణయించారు. పబ్లిక్ఇష్యూ ద్వారా వచ్చిన డబ్బును క్యాపెక్స్కు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వాడుతారు. కొంత డబ్బుతో సబ్సిడరీ కంపెనీ కోసం కొత్త ప్రాజెక్టును చేపడతారు.