ఎనీటైమ్, ఎనీవేర్..యుద్దానికి సై అంటే సై అంటున్న ఇండియన్ నేవీ

ఎనీటైమ్, ఎనీవేర్..యుద్దానికి  సై అంటే సై అంటున్న ఇండియన్ నేవీ

కయ్యానికి కాలు దువ్వుతోన్న పాక్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. పాకిస్తాన్ పై యుద్దానికి సిద్దమవుతోంది భారత్. ఇప్పటికే   ఇండియన్ ఎయిర్  ఫోర్స్ , బార్డర్ లో ఆర్మీ రెడీగా ఉండగా ఇపుడు నేవీ కూడా సై అంటే సై అంటోంది. ఎప్పుడైనా ఎలా అయినా దాడి చేసేందుకు సిద్ధమంటోంది నేవీ ఫోర్స్. ముందస్తుగా అరేబియా మహాసముద్రంలో నౌక విధ్వంసక క్షిపణులను టెస్ట్ చేసింది. టెస్ట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నేవీ. ఎవరికీ,దేనికీ భయపడమంటూ ఎవరూ ఆపరంటూ పోస్ట్ పెట్టింది ఇండియన్ నేవీ.ఏ భూభాగం దూరం కాదు,క్లిష్టం కాదంటూ తెలిపింది.

మరో వైపు జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో ప్రతి భారతీయుడు రక్తం మరిగిపోతుందని ప్రధాని మోడీ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి ప్రతి భారతీయ పౌరుడిని తీవ్రంగా బాధించిందని, దాడి ఘటనను దేశమంతా ఖండించిందన్నారు.పలు దేశాధినేతలు సైతం పహల్గాం ఉగ్రదాడిని ఖండించారని అన్నారు. ఈ సంక్షోభ సమయంలో దేశం ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన మోడీ.. ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ దాడి కాశ్మీర్ సాధిస్తోన్న అద్భుతమైన పురోగతిని దెబ్బతీసేందుకు చేసిన తీవ్ర ప్రయత్నమని అన్నారు  మోదీ.

హల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్  పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  26 మంది టూరిస్టులను  హతమార్చిన తర్వాత భారత్  పాకిస్తానీయులను వారి స్వదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే కీలకమైన సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది.  పాకిస్తాన్ భారతదేశంతో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా రద్దు చేసింది. భారత దళాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ వైపు నుండి పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది.