ఉప్పునుంతల, వెలుగు : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో సునీత, ఎస్ఐ లెనిన్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్, సీడ్స్ షాపులను తనిఖీ చేశారు. రికార్డులు, విత్తనాలను పరిశీలించారు.
రైతులకు విత్తనాలు, ఎరువులకు సంబంధించిన రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ఇదిలాఉంటే మండలంలోని వెల్టూర్ గ్రామంలో ఏఈవో భరత్ రైతులతో సమావేశమై నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.