విద్యార్థులకు బిగ్ అలర్ట్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్

విద్యార్థులకు బిగ్ అలర్ట్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్

ఆంధ్రప్రదేశ్: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్‎ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 2024, డిసెంబర్ 11న రిలీజ్ చేశారు. 2025, మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీషు, 24న మ్యాథ్య్స్, 26న ఫిజిక్స్, 28న బయోలజీ, 31న సోషల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. 

ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యిందని.. విద్యార్థులు ఈ క్షణం నుంచే టైమ్ టైబుల్ ప్రిపేర్ చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని.. లైఫ్‎లో పదో తరగతి మార్కులు ఎంతో కీలకమని విద్యార్థులకు చెప్పారు. 

ALSO READ | వచ్చే 5 ఏళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

పరీక్షలు అనగానే బయపడి ఎలాంటి ఒత్తిడికి గురి కావొద్దని.. టైమ్ టైబుల్ ప్రకారం చదివితే ఉత్తీర్ణత సాధించడం ఈజీ అన్నారు. ఒత్తడికి గురి కాకుండా చదివి.. మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యార్థులకు మంత్రి లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

పరీక్షల పూర్తి షెడ్యూల్:

  • మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్
  •  మార్చి19న సెకండ్ లాంగ్వేజ్
  •  మార్చి 21న ఇంగ్లీషు
  •  మార్చి 24న మ్యాథ్య్స్
  • మార్చి 26న ఫిజిక్స్
  • మార్చి 28న బయోలజీ
  • మార్చి 31న సోషల్ పరీక్షలు

  •