పొలిటికల్ హత్యలు కావు… ఆ మర్డర్లన్నీ ఎన్నికలముందే జరిగాయి

పొలిటికల్ హత్యలు కావు… ఆ మర్డర్లన్నీ ఎన్నికలముందే జరిగాయి

ఆంధ్ర ప్రదేశ్: పల్నాడులో పొలిటికల్ హత్యలు జరుగలేదని చెప్పారు అమరావతి అడిషనల్ డీజీపీ రవిశంకర్. జరిగిన హత్యలన్నీ కూడా ఎలక్షన్ కంటే ముందు జరిగినవేనని అన్నారు. పల్నాడులో శాంతి భద్రతలు అదుపులో లేవని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారని చెప్పారు. డీజీపీ ఇచ్చిన ఆదేశాలతో తాము పూర్తిస్థాయిలో నివేధిక తయారు చేశామని చెప్పారు. మంగళగిరిలో టీడీపీ నేత హత్య పొలిటికల్ హత్యగా ఫిర్యాదు చేశారని.. అయితే ఆ హత్య కు రాజకీయాలకు సంబంధంలేదని… వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగిందని తెలిపారు. కొంతమంది కావాలనే ‘చలో ఆత్మకూరు’ అనే పుస్తకం పేరుతో తప్పుడు ప్రచారాలు చేశారని అన్నారు.

పల్నాడు వదిలిపెట్టి వేరే ఊరికి బతకడానికి వెళ్లిన వారికి హత్యలకు సంబంధంలేదని చెప్పారు రవిశంకర్. వారివారి వ్యక్తిగత కారణాల వల్లే ఊళ్లు వదిలి వెళ్లిపోయారని చెప్పారు. 34మంది మాత్రమే పల్నాడును వదిలి పెట్టి వెళ్లారని చెప్పారు. మరికొంతమంది ఊర్లను వదిలి పెట్టి పోయారని వాళ్లకు హత్యకు సంబంధంలేదని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ మొత్తం టిడిపి నేతలపై జరిగిన దాడుల గురించి డిజిపి కి ఫిర్యాదు చేశారని… అందులో మొత్తం 126 కేసులలో ఎఫ్. ఐ. ఆర్. నమోదు చేశామని చెప్పారు.