ఏపీ వార్షిక బడ్జెట్ 2 లక్షల 56వేల కోట్లు

ఏపీ వార్షిక బడ్జెట్ 2 లక్షల 56వేల కోట్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టి కేటాయింపులను సభకు చదివి వినిపించారు. 
2022-23 వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు
రెవెన్యూ వ్యయం:  రూ. 2,08, 261 కోట్లు
మూలధన  వ్యయం:  రూ. 47,996 కోట్లు
రెవెన్యూలోటు: రూ. 17,036 కోట్లు
ద్రవ్యలోటు:  రూ. 48,724 కోట్లు
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక:  రూ. 18 వేల కోట్లు కేటాయింపు
వైఎస్సార్‌ రైతు భరోసా: రూ. 3,900 కోట్లు కేటాయింపు

నవరత్నాల సంక్షేమానికి పెద్దపీట
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక: రూ. 18 వేల కోట్లు కేటాయింపు
వైఎస్సార్‌ రైతు భరోసా: రూ. 3,900 కోట్లు కేటాయింపు

పాల ఉత్పత్తి, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖకు: రూ.1,568 కోట్లు
ఉన్నత విద్యకు: రూ.2,014 కోట్లు కేటాయింపు
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రెండింతల కేటాయింపులు పెంపు
వెనుకబడిన వర్గాల అభివృద్ధికి:  రూ.20,962 కోట్లు
వ్యవసాయ  మార్కెటింగ్‌, సహకార శాఖకు: రూ.11,387 కోట్లు
ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ రూ 11,482 కోట్లు
గ్రామీణాభివృద్ధికి: రూ.17,109 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలకు: రూ.13,630 కోట్లు
ఇంధన రంగానికి: రూ.10,281 కోట్లు
జనరల్ ఏకో సర్వీసెస్: రూ.4,420 కోట్లు
ఇండస్ట్రీ అండ్ మినరల్స్: రూ.2,755 కోట్లు
విద్యుత్ - రూ.10,281.04 కోట్లు
సెకండరీ ఎడ్యుకేషన్ విభాగానికి: రూ.27,706.66 కోట్లు
వ్యవసాయానికి:  రూ.11,387.69 కోట్లు
పశు సంవర్ధక శాఖకు: రూ.1,568.83 కోట్లు
బీసీ సంక్షేమ శాఖ: రూ.20,962.06 కోట్లు
పర్యావరణ, అటవీ శాఖ: రూ.685.36 కోట్లు
ఉన్నత విద్యా శాఖకు: రూ.2,014.30 కోట్లు
ఆర్థిక సేవల రంగానికి: రూ.69,306 కోట్లు


సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి: రూ.685 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్ కు: రూ.6,145 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ కు : రూ.18,518 కోట్లు
బీసీ సబ్ ప్లాన్ కు: రూ.29,143 కోట్లు
ఎంఎస్ఎంఈలకు: రూ.450 కోట్లు
గ్రామీణాభివృద్ధికి: రూ 17,109 కోట్లు
కొత్త మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు: రూ.320కోట్లు
రవాణా రంగానికి: రూ.9,617 కోట్లు
విశాఖపట్టణం - చెన్నై ఇండస్ట్రియల్ కారిార్ కు రూ.236 కోట్లు
ఎస్సీ పారిశ్రామిక వేత్తల ఇన్సెంటివ్ లకు రూ.175 కోట్లు
104 సర్వీసులకు : రూ.140 కోట్లు
108 సర్వీసులకు: రూ.133 కోట్లు
వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాకు : రూ.300 కోట్లు

 

ఇవి కూడా చదవండి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్