ఐదు రోజులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఐదు రోజులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. జూలై 26 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాసేపటి క్రితమే స్పీకర్ అయన్న పాత్రుడి అధ్యక్షతన  బీఏసీ సమావేశం  ముగిసింది. సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్,జనసేన నుంచి మంత్రి నాదేండ్లమనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ హాజరయ్యారు. వైసీపీ నుంచి ఎవరూ హాజరుకాలేదు. అన్ని శాఖలపై సభలో శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు.

 జూలై 22న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ ఉదయం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీ నేతలు గవర్న్ ప్రసంగంపై అభ్యంతరం చెబుతూ వాకౌట్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలపై నిరసనగా  వైసీపీ నేతలు నల్ల కండువాలతో అసెంబ్లీకి వచ్చారు.