ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
  •  సేవ్ డెమోక్రసీ ప్లకార్డులతో వైసీపీ నిరసన

  •  ప్లకార్డులు చించేసిన పోలీసులు

  •  పోలీస్ జులుం ఎల్లకాలం సాగదన్న జగన్

అమరావతి: ఏపీ అసెంబ్లీ వద్ద ఇవాళ ఉద్రిక్తత నెలకొంది.  రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ సీఎం జగన్ తో కలిసి అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు వచ్చారు. ‘‘సేవ్‌ డెమోక్రసీ’’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అయితే..వైఎస్సార్‌సీపీ చట్ట సభ్యుల్ని గేటు వద్దే  పోలీసులు అడ్డుకున్నారు. ఫ్లకార్డులు ప్రదర్శించొద్దంటూ వాదనకు దిగారు. ఈ క్రమంలో ప్లకార్డుల్ని లాగేసి చించేశారు. దీంతో వైఎస్‌ జగన్‌  పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘ప్లకార్డులు ఆపాలని ఎవరు చెప్పారు?. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. పోలీసుల జులుం ఎల్లకాలం సాగదు. పోలీసులు ఉన్నది ప్రజాస్వామాన్ని ఖూనీ చేయడానికి కాదు. ప్రజా స్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పోలీసులు వైఖరి అత్యంత దారుణంగా ఉంది. చట్ట ప్రకారం పోలీసులు పని చేయాలి’అంటూ ఫైర్ అయ్యారు. దీంతో అసెంబ్లీ గేటు వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే జగన్‌ నిలదీత, ఈలోపు సభ ప్రారంభం అవుతుండడంతో కాసేపటికికే నల్ల కండువాలతోనే వైఎస్సార్‌సీపీ సభ్యుల్ని పోలీసులు లోపలికి అనుమతించారు.