రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త ప్రభుత్వంలో మొదటి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

రేపు ఉదయం 11.05 నిమిషాలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్యెల్యేల చేత ప్రమాణం చేయిస్తారు ప్రొటెం స్పీకర్ అప్పల నాయుడు. అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాంను ఎల్లుండి ఎన్నుకుంటారు. ఈ నెల 14న రెండు సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగింస్తారు.

ఈ నెల 15,16 తేదీల్లో అసెంబ్లీకి సెలవు. తిరిగి 17,18 తేదీల్లో అసెంబ్లీ జరుగుతుంది. 18న సమావేశాలు ముగుస్తాయి.