జూన్ 17నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్..

ఏపీలో భారీ మెజారిటీతో గెలుపొందిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది.జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో సీఎంగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కూటమి నేతలు. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.ఇదిలా ఉండగా, జూన్ 17న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని సమాచారం అందుతోంది.ఈ సమావేశాలు నాలుగురోజుల పాటు కొనసాగనున్నాయని తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి కేటాయించగా, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది.ఆ తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన కీలక హామీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించే అవకాశం ఉంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన జగన్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది.