జగన్కు ప్రతిపక్ష హోదాపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కీలక ప్రకటన

జగన్కు ప్రతిపక్ష హోదాపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కీలక ప్రకటన

వైసీపీ అధినేత జగన్ కు ప్రతిపక్ష హోదాపై ఏపీ అసెంబ్లీలో  కీలక ప్రకటన చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సభలో 10 శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సభలో ఏ పార్టీకీ ప్రతిపక్ష హోదా రాదని చెప్పారు. 

ప్రతిపక్ష హోదా కల్పించాలని హైకోర్టు స్పీకర్ కు సమన్లు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, స్పీకర్ కు దురుద్దేశాలను ఆపాదించడం సభాహక్కుల ఉల్లంఘనే అవుతుందని అసెంబ్లీలో స్పీకర్ అయన్నపాత్రుడు అన్నారు.  24 జూన్ 2024లో అభియోగాలు, బెదిరింపులతో  జగన్ లేఖ రాశారని తెలిపారు. స్పీకర్ కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై జగన్ కోర్టుకు వెళ్లారని, స్పీకర్, శాసనసభ వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారని తెలిపారు. ప్రతిపక్ష హోదా కల్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని పిటిషన్ లో కోరినట్లు తెలిపారు. ఈ లోపే స్పీకర్ కు సమన్లు వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విచారణ అర్హత పొందని రిట్ పిటిషన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  స్పీకర్ ప్రమాణ హోదాకు ముందే ప్రతిపక్ష హోదా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. 

ALSO READ : బనకచర్లకు నీళ్లు తీస్కుంటే తప్పేంటి.. సముద్రంలోకి వృథాగా పోయే నీళ్లపై రాజకీయాలా?: చంద్రబాబు

స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ ను క్షమిస్తున్నాని అయ్యన్నపాత్రుడు అన్నారు. సభకు వైసీపీ సభ్యులు రావాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ప్రతిపక్ష హోదాపై తప్పుడు ప్రచారం, జగన్ లేఖపై సభకే వదిలేస్తున్నానని ఈ సందర్భంగా స్పీకర్ అన్నారు.