
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ కోసం ఇండియా అథ్లెటిక్స్ టీమ్‌ను గురువారం ప్రకటించారు. ఏపీ అథ్లెట్ ఎర్రాజీ జ్యోతి ఇండియా తరఫున తొలిసారి 100 మీటర్లలో బరిలోకి దిగనుంది. షాట్‌ఫుట్ ప్లేయర్ అబా ఖాతున్ కూడా తొలిసారి గేమ్స్‌లో పాల్గొననున్నాడు. 17 మెన్స్, 11 విమెన్స్‌తో కూడిన 28 మంది టీమ్‌కు జావెలిన్ స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా సారథ్యం వహించనున్నాడు.
గాయంతో గేమ్స్‌కు దూరమైన లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ ప్లేస్‌లో జెస్విన్ అల్డ్రిన్‌కు చివరి నిమిషంలో చోటు కల్పించారు. అవినాష్ సాబ్లే (3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్), తేజిందర్‌పాల్ సింగ్ (షాట్‌ఫుట్), ప్రవీణ్ చిత్రవేల్ (ట్రిపుల్ జంప్), మహ్మద్ అనాస్, అజ్మల్, జాకబ్, సంతోష్, రాజేశ్ రమేశ్‌లు 4x400 మీటర్లలో బరిలోకి దిగనున్నారు.