పేదరిక నిర్మూలనే బీజేపీ లక్ష్యం: కన్నా

పేదరిక నిర్మూలనే బీజేపీ లక్ష్యం: కన్నా

పేదరిక నిర్మూలన కోసం బీజేపీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. నిన్న ప్రవేశ  పెట్టిన బడ్జెట్ లో కూడా పేదరిక నిర్మూలనే ప్రత్యేక అజెండాగా ఉందని ఆయన తెలిపారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అన్న నినాదంతోనే తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రతీ రాష్ట్రానికి డ్వాక్రా రుణాలు,ముద్రా లోన్ లు మరుగుదొడ్ల నిర్మాణాలు, ఇంటి నిర్మాణాం లాంటి ప్రతి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పారు. అతి పెద్ద రాజకీయ సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ బిజెపి అని తెలిపారు. ప్రతీ ఒక్కరూ  8980808080 నంబర్ కి మిస్డ్ కాల్ చేసి బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు.