బీజేపీ ప్రభుత్వానికి..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రెండూ సమానమే

బీజేపీ ప్రభుత్వానికి..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రెండూ సమానమే

కేంద్రప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలు రెండూ.. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్​ సమానమేనని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు.. ఎంపీ పురంధరేశ్వని అన్నారు.   ప్రధానమంత్రి కులాన్ని లీగల్లీ కన్వర్టెడ్​ అని అనడం ...బీసీ లను అవమానించినట్టేనని పురంధరేశ్వరి చెప్పారు. ముస్లింలను బీసీలలో చేర్చడాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. హస్తకళల కోసం విశ్వకర్మ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.   

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన  జలజీవన్ పథకాన్ని కేంద్రమే  అమలు చేసిందని చెప్పారు. 2000 వ సంవత్సరంలో ప్రధాని కులాన్ని కాంగ్రెస్​ ప్రభుత్వమే బీసీ కేటగిరీలో చేర్చిందంటూ...   జనాభా ప్రతిపాదికన బడ్జెట్ కేటాయిస్తారని... ఎన్డీఏ కూటమి వచ్చాక కట్టిన పన్నులలో 42% వాటా ఇస్తున్నామని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుతూ  రెండు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేయడం లేదని .. వాగ్దానాలు అన్నీ నీటి మూటలుగా మారాయని విమర్శించారు. సమసమాజ స్థాపనే బీజేపి లక్ష్యంమంటూ.. ఆ దిశగా కేంద్ర బడ్జెట్ రూపకల్పన చేశారు.

Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్

దేశవ్యాప్తంగా ఎనభై ఒక కోట్ల మంది జన్ ధన్ ఖాతాల  ద్వారా లబ్ది పొందుతున్నారని.. ప్రధాన్ మంత్రి అవాస్ యోజన ద్వారా ఇండ్లు కట్టుకోవడానికి కేంద్రం లక్షన్నర సహాయం అందిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా  కేంద్రం పేదలకి వైద్యం‌ అందిస్తోందన్నారు.  తెలంగాణలో   అయుస్మాన్ భారత్ అమలు చేయడం లేదని..  నిరుపేదలు,వయస్సు పై బడిన వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయుష్మాన్ భారత్ అమలు చేయకుండా మోసం చేస్తుందన్నారు.