AP Budget: అమరావతికి 6 వేల కోట్లు.. బడ్జెట్‌లో రాజధానికి భారీగా నిధులు

AP Budget: అమరావతికి 6 వేల కోట్లు.. బడ్జెట్‌లో రాజధానికి భారీగా నిధులు

ఏపీ బడ్జెట్‌లో రాజధాని అమరావతికి భారీగా నిధులు కేటాయించింది ప్రభుత్వం. అమరావతి.. ది పీపుల్స్ కేపిటల్ పేరుతో.. అభివృద్ధి పనులకు 6 వేల కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రకటించారు. 2025, ఫిబ్రవరి 28వ తేదీ ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల హామీలో భాగంగా అమరావతి నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించింది.

అమరావతి రాజధానిలో నిర్మాణాలు, మౌళిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సౌకర్యాలు, ప్రభుత్వ శాఖలకు కావాల్సిన భవనాల నిర్మాణానికి ఈ 6 వేల కోట్లు ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం.

Also Raed : రూ.3 లక్షల 22 వేల కోట్లతో ఏపీ బడ్జెట్

అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఇతర ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి 15 వేల కోట్లకుపైగా అప్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతికి నిధులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ లోనూ అమరావతికి అత్యధికంగా 6 వేల కోట్లు కేటాయించటం ద్వారా.. ఇక నుంచి అమరావతిలో పనులు ఊపందుకోనున్నాయి. 

అమరావతికి బడ్జెట్ లోనే 6 వేల కోట్లు కేటాయించటంపై అమరావతి ప్రాంత రైతులు, ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీపుల్స్ రాజధానిలో పనులు ఇక నుంచి వేగం పుంజుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.