
ఏపీ ప్రభుత్వం తల్లులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన తల్లికి వందనం పథకానికి రూ.9వేల 407 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15000 చొప్పున అందిస్తారు. ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి.
పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఏ కారణం చేతనూ ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. తల్లికివందనం పథకం కోసం రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
Also Read :- రూ.3 లక్షల 22 వేల కోట్లతో ఏపీ బడ్జెట్
2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం క్రింద 15,000 రూపాయలను తల్లిదండ్రులకు ఆర్థిక సహాయంగా అందించనున్నారు. బడికి వెళ్లే ప్రతి విద్యార్థి ఈ పథకం వర్తించనుంది. 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది.