వార్షిక బడ్జెట్ తోపాటు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్

వార్షిక బడ్జెట్ తోపాటు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
  • వార్షిక బడ్జెట్ తోపాటు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ 
  • రెండు బడ్జెట్లను వేర్వేరుగా ప్రవేశపెట్టనున్న మంత్రులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో మొదలుకానున్నాయి. కొద్ది సేపటి క్రితం అంటే ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ ప్రత్యేక సమావేశం జరిగింది. బడ్జెట్ ను రెండు కేటగిరీలుగా చేసి వేర్వేరుగా ప్రవేశపెట్టనున్నారు మంత్రులు. వార్షిక బడ్జెట్ తోపాటు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 
మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాల్లో ఉదయం 10.15 కి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. తర్వాత సాధారణ బడ్జెట్ తర్వాత వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు సంబంధిత మంత్రి కన్నబాబు. 
శాసనమండలి లో సాధారణ బడ్జెట్ ను మంత్రి అప్పలరాజు ప్రవేశ పెట్టనుండగా వ్యవసాయ బడ్జెట్ మంత్రి వేణుగోపాల్ ప్రవేశపెట్టనున్నారు. సుమారు 2.5 లక్షల కోట్లతో సాధారణ బడ్జెట్ అంచనాలు సిద్ధం చేసినట్లు సమాచారం. 30 వేల కోట్లకు పైగా అంచనాలతో వ్యవసాయ బడ్జెట్ కు అంచనాలు తయారు చేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్ లో నవరత్నాలు, రాష్ట్ర అభివృద్ధి, సాగు నీటి పథకాలకు ప్రాధాన్యత ఇస్తారని అంచనా. 

ఇవి కూడా చదవండి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్