రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. రైతులకు కేంద్రం ఇస్తున్న రూ. 10వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో రూ. 10వేలు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా.. మత్స్యకారులకు కూడా ఫిషింగ్ హాలిడే సమయంలో రూ. 20వేలు ఇవ్వాలని నిర్ణయించింది క్యాబినెట్. ఇవాళ ( జనవరి 2, 2025 ) జరిగిన సమావేశంలో మొత్తం 14అంశాలకు ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్. వచ్చే విద్యాసంవత్సరం నుండి తల్లికి వందనం చెల్లింపు ప్రారంభించాలని నిర్ణయించింది క్యాబినెట్.
జనవరి 8న ప్రధాని మోడీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో మోడీ పర్యటనకు సంబంధించి సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది క్యాబినెట్. ఈ పర్యటనలో గ్రీన్ హైడ్రోజెన్ హబ్ కు శంకుస్థాపన చేయనున్నారు మోడీ. దీంతో పాటు అమరావతిలో రూ. 2 వేల 723 కోట్లతో రెండు పనులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి త్వరలోనే కొత్త టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించింది క్యాబినెట్.
ఈ సమావేశంలో మున్సిపల్ చట్టం సవరణకు ఆమోదం తెలిపింది క్యాబినెట్. సోలార్, విండ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యాబినెట్. క్యాబినెట్ నిర్ణయం పట్ల ఏపీ రైతులు, మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.